ఏపీ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై కమిటీ ఏర్పాటు

  • Publish Date - September 13, 2019 / 03:50 PM IST

ఏపీ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జీఎన్‌ రావు నియమితులయ్యారు. ఐదుగురు సభ్యులతో ఏర్పాటు ఈ కమిటీ ఏర్పాటు అయింది. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించనుంది.  

ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహావీర్‌, అర్బన్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్‌, ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్‌, సెప్ట్ ప్రొఫెసర్ శివానందస్వామి, చెన్నైకు చెందిన రిటైర్డ్ అర్బన్ ప్లానర్ డాక్టర్‌ కేవీ.అరుణాచలం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

దీంతోపాటు వరదనీటి యాజమాన్యంపై కూడా ఓ సభ్యుడిని ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆరు వారాల్లో దీనికి సంబంధించిన అంశాలపై నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ