సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

  • Publish Date - October 1, 2019 / 06:47 AM IST

సీఎం జగన్‌కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో కోరారు ఆయన. ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ.. కూలీలలకు బిల్లులు ఇవ్వటంలేదని ప్రస్తావించారాయన. కష్టపడిన కూలీలకు డబ్బులు అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు.

కూల్చివేతలు, ఒప్పందాల రద్దులతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిందన్నారు. రాజకీయాలు మాని వెంటనే ఉపాధిహామీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్నారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎం జగన్ కు విషయాలను వివరించారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.