మోటార్‌సైకిల్‌తో రైతు ప్రయోగం…

  • Publish Date - January 19, 2019 / 05:01 AM IST

వరంగల్‌: ముల్కనూర్‌కు చెందిన పడాల గౌతమ్ అనే ఓ రైతు మోటార్‌సైకిల్‌తో కందికాయ పడితే ఎలా ఉంటదనే ఆలొచనను ప్రయత్నించాడు. గౌతమ్ తన ఎకరం చేనులో కంది పంటను పండించాడు. అయితే… దానిని పట్టేందుకు మోటార్‌ సైకిల్‌ను వినియోగించాడు. గతంలో అయితే ఎకరం కందికాయ పట్టాలంటే రెండు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ సెంటర్ స్టాండ్‌ వేసి ఎక్స్‌లేటర్‌ పూర్తిగా ఇచ్చి దానికి తాడు కట్టీ, అదే రేసింగ్‌లో వెనుక టైరు పుల్లల మధ్య కందిచెట్టను పెట్టాడు. దీంతో కందికాయ రాలిపోయింది. సుమారు రెండు గంటల సమయంలో ఎకరం కంది కాయను ఇద్దరు మహిళా కూలీలతో పట్టేశాడు. దీనికి కేవలం లీటరు పెట్రోల్‌ ఖర్చు అయినట్లు ఆయన పేర్కొన్నారు. సమయంతో పాటు తన శ్రమ, కూలీల ఖర్చు తగ్గిందని పడాల గౌతమ్ వివరించారు.