ఏపీలో పేద విద్యార్దులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించారు.
అంతేకాదు తల్లిదండ్రులకు భారంగా ఉండే హాస్టల్ ఖర్చులన కూడా తమ ప్రభుత్వమే భరిస్తుందనీ..దాని కోసం ప్రతీ సంవత్సరం రూ.20వేలు ప్రతీ సంవత్సరం రూ.20వేలు ఇస్తామన్నారు.
పేద విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను గత ప్రభుత్వం ముష్టి వేసినట్లుగా చేసిందనీ..చాలీ చాలని ఫీజులతో విద్యార్దులు చదువులు మానివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని సీఎం జగన్ విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందనీ..చదువు మానివేసిన విద్యార్ధులంతా తిరిగి చదువుకోవాలని సీఎం ఆకాంక్షించారు.