మహిళా దొంగల హల్‌చల్‌ : రూ. 3 లక్షల 48 వేలు చోరీ

నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ బస్‌స్టాండ్‌లో మహిళ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. మూడు లక్షల 48 వేల రూపాయలను దొంగిలించారు.

  • Publish Date - October 1, 2019 / 03:43 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ బస్‌స్టాండ్‌లో మహిళ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. మూడు లక్షల 48 వేల రూపాయలను దొంగిలించారు.

నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ బస్‌స్టాండ్‌లో మహిళ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. ఒంటరి మహిళ డబ్బుతో వెళ్తుండగా.. అదనుగా చూసి దొంగతనం చేసింది ఈ ముఠా. నవీపేట్‌కు చెందిన నాగమణి, నారాయణ నుంచి.. మూడు లక్షల 48 వేల రూపాయలను దొంగిలించారు. అక్కడే ఉన్న ప్రయాణికులు గమనించి మహిళా ముఠాను నిలదీయగా రెండు లక్షల 80 వేల రూపాయలు తిరిగి ఇచ్చేశారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. 8 మంది మహిళలను అదుపులో తీసుకున్నారు. ఈ ముఠా ఆదిలాబాద్ చెందినవారుగా తేల్చారు పోలీసులు. అయితే, తాము దొంగతనం చేయలేదని, పూసలు అమ్ముకొని సంచారం చేస్తూ బతుకుతున్నామని పోలీసుల అదుపులో ఉన్న మహిళలు తెలిపారు.