ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

  • Publish Date - December 5, 2019 / 03:59 PM IST

ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదులు చేస్తే జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా బాలుడి మిస్సింగ్‌ కేసుకు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

వీరులపాడు మండలం రంగాపురంకు చెందిన బాలుడి కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలుడి తండ్రి రవినాయక్ ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. 

కంచికచర్ల పోలీస్  పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.