గోదావరి జిల్లాలకు వరద ముప్పు

గోదావరిలో గంట గంటకూ పెరుగుతున్న నీటి ఉద్ధృతితో గోదావరి జిల్లాలకు మళ్లీ వరద ముప్పు మొదలయ్యింది.

  • Publish Date - September 7, 2019 / 06:34 AM IST

గోదావరిలో గంట గంటకూ పెరుగుతున్న నీటి ఉద్ధృతితో గోదావరి జిల్లాలకు మళ్లీ వరద ముప్పు మొదలయ్యింది.

గోదావరిలో గంట గంటకూ పెరుగుతున్న నీటి ఉద్ధృతితో గోదావరి జిల్లాలకు మళ్లీ వరద ముప్పు మొదలయ్యింది. నీటిమట్టం పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు కాఫర్ నిర్మాణం వల్ల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. ఐదు లక్షల 66వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. 10 అడుగలకు నీటి మట్టం చేరడంతో.. 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలానికి మళ్లీ గోదావరి వరద ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. నెలరోజుల వ్యవధిలో ఇది నాలుగోసారి వచ్చింది. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ప్రస్తుతం గోదావరి నది ఒడ్డున ఉన్న అన్ని గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పూడిపల్లి, తొయ్యరు గ్రామాల్లోకి వరదనీరు చేరింది. 

తాగునీటి బోర్లు మునిగిపోవడంతో వరదనీటినే తాగుతున్నారు. అటు కాఫర్‌డ్యాం వద్ద నీటి ప్రవాహం ఉధృతిగా కొనసాగుతోంది.. ముంపుగ్రామాల్లోకి పూర్తిగా వరదనీరు చేరకముందే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read : బస్సులో రూ.54 లక్షల చోరీ