బ్రాండ్ కోసం : విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్

  • Publish Date - January 12, 2019 / 05:30 AM IST

విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. తెలుగు వంటకాల బ్రాండ్ కోసం సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్న క్రమంలో విజయవాడలోని నోవాటెల్‌లో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా జనవరి 11న ఈ ఫుడ్ ఫెస్టివల్ ను  ప్రారంభించారు. ట్రెడిషన్ వంటకాలతో పాటు ట్రెండ్లీ వంటకాలు నోరూరించాయి. ఇటువంటి పసందైన 66 వంటకాలు సందర్శకుల నోరూరించాయి. తెలుగు ప్రజల ప్రత్యేక వంటకాలకు బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్టు ముకేశ్ కుమార్ తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు వంటకాలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.