విశాఖ రాజధానిని ఆహ్వానిస్తున్నా…కానీ పార్టీని వీడటంలేదు : గంటా

  • Publish Date - December 31, 2019 / 06:18 AM IST

విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి నా మద్దతు తెలిపాననీ అంత మాత్రాన తాను పార్టీని వీడుతానంటు వచ్చిన వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నం వాస్తవ్యుడిగా విశాఖ రాజధానిని స్వాగతించాలననీ..గానీ తాను పార్టినుంచి తప్పుకోవటంలేదని గంటా తెలిపారు.

విశాఖపట్నం అనేది ఒక ప్రశాంతమైన నగరమని విశాఖ వాసిగా తాను ఈ నగరాన్ని ఎంతో ఇష్టపడతానని అన్నారు. రాజధాని అంటే రకరకాల శక్తులు వస్తాయి..ఇప్పటి వరకూ ప్రశాంతంగా ఉండే విశాఖలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని..కానీ నగర ప్రశాంతతకు విఘాతం వాటిల్లకుండా రాజధాని ఉండాలని గంటా శ్రీనివాసరావు కోరారు.   

అమరావతి రైతులను బాధపెట్టి  విశాఖకు రాజధానిని తరలించటం సరికాదని అన్నారు. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 2020 నూతన సంవత్సరా వేడులకు దూరంగా ఉంటామని న్యూఇయర్ వేడుకలకు అయ్యే ఖర్చు డబ్బును అమరావతి రైతులకు ఇస్తామని గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. 

కాగా..ఏపార్టీలోకి మారినా మంత్రి పదవిని మాత్రం గంటా దక్కించుకంటారు.అది ఆయన ప్రత్యేకత. ఇటీవల సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావని ప్రతిపాదించని సయమంలో గంటా ఆ ప్రతిపాదనను స్వాగతించారు. దీంతో గంటా పార్టీ మారతారని..వైసీపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. గతంలో కూడా పలు పార్టీలు మారిన గంటా మంత్రి పదవిని మాత్రం దక్కించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రకటనతో మరోసారి గంటా పార్టీ మారతారని వార్తలు హల్ చల్ చేశాయి. పార్టీ మారుతున్నారనే విషయంపై గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు.