హంద్రినీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి 

  • Publish Date - September 25, 2019 / 05:22 AM IST

అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవిచింది. బుధవారం (సెప్టెంబర్  25) ఉదయం 9.30కు  ట్రాక్టర్ బోల్తా పడినలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కదిరి నియోజకవర్గం నంబులపూలకుంటలోని ఎన్ బీ సోలార్ పవర్ ప్లాంట్‌ సమీపంలోని హంద్రినీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు నీటిలో దూకటంతో కొద్దిపాటి గాయాలతో బైటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని..గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు. కుర్లా మంజు, ఆసీఫ్, సబ్బార్ తో పాటు మరో వ్యక్తి అక్కడిక్కడే మరణించారు. మజ్జీద్, జహంగీర్ లు నీటిలో దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. వీరంతా సోలార్ పరవ్ ప్లాంట్ లో పనిచేస్తున్న యూపీ, బీహార్ కు చెందిన కూలిలు.