తిరుపతి రుయా ఆస్పత్రిలో నలుగురు సైకోల హల్‌చల్: బ్లేడులతో కోసుకుని వీరంగం..

  • Publish Date - February 20, 2020 / 10:22 AM IST

తిరుపతి రుయా హాస్పిటల్ ఆవరణలో సైకోలు వీరంగం సృష్టించారు. రుయా హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో నలుగురు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. ఘర్షణకు దిగారు. హాస్పిటల్ క్యాంపస్ లోకి దూసుకువస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సదరు వ్యక్తులు సైకోలుగా వ్యవహరించారు.

బ్లేడులు ఒకరిపై మరొకరు కోసుకున్నారు. తల నేలకేసి బాదుకుంటూ నానా హంగామా బీభత్సం సృష్టించారు.తలకొట్టుకుంటూ ఏడ్చారు. నానా హంగామా చేశారు.నానా దుర్భాషలాడారు. ఇష్టమొచ్చినట్లుగా వీరంగం సృష్టించారు.     

వారిని అడ్డుకోవటంతో నలుగురు సైకోలుగా వ్యవహరిస్తూ..తమ దగ్గర ఉన్న బ్లేడులు తీసి పరస్పరం వారిలో వారే గాయాలు చేసుకున్నారు. దీంతో నర్శింగ్ సిబ్బంది భయపడ్డారు. తమపై కూడా బ్లేళ్లతో దాడిచేస్తారని భయపడి పరుగులు తీశారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన హాస్పిటల్ వద్దకు వచ్చిన పోలీసులు నలుగురు సైకోలను అదుపులోకి తీసుకున్నారు. అసలు వారు ఎవరు? ఎందుకు హాస్పిటల్ కు వచ్చారు? ఎందుకు సిబ్బందితో ఘర్షణ పడ్డారు? వాళ్లు సైకోలుగా ఎందుకు ప్రవర్తించారు? ఏ ఉద్ధేశ్యంతో హాస్పిటల్ వచ్చారు? వంటి అంశాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. 

Read More>>మొక్కలు బతకకపోతే ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త : కేటీఆర్