సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతు..ఒకరి మృతి

శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.

  • Publish Date - November 10, 2019 / 02:54 PM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.

శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మరొక విద్యార్థి మృతదేహం లభ్యం అయింది. అలల ఉధృతికి మిగిలిన నలుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. 

ఆదివారం కావడం, కార్తీక మాసం సందర్భంగా వన భోజనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి వెళ్లారు. అలల ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి, గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మత్స్యకారులతో కలిసి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. 

ఓ విద్యార్థి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుడు అనపర్తి సురేష్ గా గుర్తించారు. మరొకరిని క్షేమంగా కాపాడారు. మిగిలిన వారికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ యువకులు, మెరైన్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన విద్యార్థులు స్థానిక కళశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు.