ఆస్తి గొడవలతో రెండురోజులు అంత్యక్రియలు నిలిపివేత

కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. ఆస్తికోసం రెండ్రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిలిపివేశారు.

  • Publish Date - September 8, 2019 / 08:22 AM IST

కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. ఆస్తికోసం రెండ్రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిలిపివేశారు.

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. సైదాపూర్ మండలం రాములపల్లిలో ఓ మహిళ మృతి చెందింది. అయితే.. ఆమె పేరున ఉన్న ఎకరం పొలం కోసం… కోడళ్లు పోట్లాడుతుండటంతో మృతదేహాన్ని ఖననం చేయకుండా ఉంచారు. 

కుటుంబ కలహాలతో రెండ్రోజుల క్రితం వీరలక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. అయితే ఆమె కొడుకుకు ఇద్దరు భార్యలు కావడంతో.. వారు ఆస్తికోసం గొడవకు దిగారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా రెండ్రోజులుగా ఇంటిముందే ఉంచారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది.