తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి హాసిని మృతదేహం బుధవారం(సెప్టెంబర్ 18,2019) తిరుపతికి చేరుకుంది. హాసినిని
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి హాసిని మృతదేహం బుధవారం(సెప్టెంబర్ 18,2019) తిరుపతికి చేరుకుంది. హాసినిని కడసారి చూసేందుకు బంధువులు, స్ధానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హాసిని మృతదేహాన్ని చూసి తల్లి మధులత గుండెలవిసేలా రోదించింది. మరోవైపు హాసిని తండ్రి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇదివరకే చిత్తూరుకు తరలించారు. సుబ్రహ్మణ్యంకు ఇద్దరు భార్యలు కావడంతో.. పెద్ద భార్య నిర్మల దగ్గరికి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తరలించారు.
నా కూతురిని నేనే చంపుకున్నా అని హాసిని తల్లి కంటతడి పెట్టింది. బలవంతంగా లైఫ్ జాకెట్ తీయించి హాసిని మరణానికి కారణం అయ్యాను అని బోరున విలపించింది. హాసిని ఇంటి దగ్గర విషాదచాయలు అలుముకున్నాయి. బంధువులు, స్థానికులు, హాసిని ఫ్రెండ్స్ కంటతడి పెట్టారు. తిరుపతిలోని స్ప్రింగ్ డేల్ స్కూల్ లో హాసిని 7వ తరగతి చదువుతోంది. హాసిని క్షేమంగా తిరిగిరావాలని స్కూల్ ఫ్రెండ్స్ ప్రార్థనలు చేశారు.