సెకండ్ ఛాన్స్ ఇస్తారు : సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్

ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో తెలిపిన తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు

  • Publish Date - September 22, 2019 / 03:35 AM IST

ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో తెలిపిన తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు

ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అంటే.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో తెలిపిన తేదీల్లో ఏదైనా కారణంతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి సెకండ్ ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌.. జిల్లా సెలక్షన్‌ కమిటీలను(DSC) ఆదేశించారు. పరీక్షల రిజల్ట్స్ తర్వాత లక్షా 26 వేల 728 ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీలు షార్ట్‌ లిస్ట్ తయారు చేస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థుల మొబైల్‌ నెంబర్లకు, ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం పంపుతారు.

షార్ట్‌ లిస్ట్ లో పేరున్న వారు… వారి కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా జిల్లాల్లో సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 లోపే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి.
 
ఎంపికైన వారికి సెప్టెంబర్ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేస్తారు. మొదటి విడతలో 2 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అక్టోబర్‌ 2న విధుల్లో చేరాక అక్టోబర్ 14 నుంచి నవంబర్ 15 మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత ట్రైనింగ్ ఇస్తారు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ప్రతిభ మేరకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్లు వెంటనే జారీ చేసేలా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. బీసీ అభ్యర్థులు క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని, వాటితో పాటు అవసరమైన వారికి రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని ప్రభుత్వం సూచించింది.

Also Read : సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు : చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు