రాజధాని రైతులకు రిలీఫ్

రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద

  • Publish Date - August 27, 2019 / 11:29 AM IST

రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద

రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద ఇవ్వాల్సిన నిధులివి. కొన్ని రోజులుగా  రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం కౌలు డబ్బు ఇవ్వలేదని రోడ్డెక్కారు. 14 నెలల నుండి రావాల్సిన కౌలు డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు రాజధాని రైతులకు త్వరలో కౌలు డబ్బులు చెల్లిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కౌలు డబ్బులు ప్రతి రైతుకి అందేలా చూస్తామన్నారు. కౌలు అందలేదనే అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారని వెల్డడించారు. కౌలు డబ్బుల అంశంపై చర్చించేందుకే రైతులు నా దగ్గరికి వచ్చారని బొత్స వివరించారు.

ఏపీ రాజధాని విషయంలో గందరగోళం నెలకొంది. రాజధానిని తరలిస్తారనే వార్తలతో భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని మార్పు వార్తలతో వారు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి బొత్స తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అటు సీఎం జగన్ కి రాజధాని రైతుల నిరసన సెగ తాకింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం దగ్గర రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలతో గందరగోళం నెలకొందన్న రైతులు.. రాజధాని మార్పుపై సీఎం సమాధానం చెప్పాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : అలర్ట్ : తిరుమల కొండపైకి ఆ వాహనాలకు నో ఎంట్రీ