గురజాలలో పోలీసుల కాల్పులు

గురజాలలో తెదేపా కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. 2లక్ష 50వేల మంది ఓటర్లున్న గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలించేందుకు వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి పోలింగ్ బూత్‌లలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గురజాల పోలింగ్ బూత్‌కు చేరుకోగానే అక్కడున్న తెదేపా కార్యకర్తలు అతని కారుపై దాడికి దిగారు. 

విధ్వంసం సృష్టించారు. దాంతో మహేశ్ రెడ్డి తిరుగుప్రయాణమైయ్యారు. కారుపై దాడికి దిగిన వైఖరిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఒకడుగు ముందుకేశారు. తుపాకులు ఎక్కుపెట్టి మొండిగా వాదిస్తున్న తెదేపా కార్యకర్తలను చెదరగొట్టారు. 

తమ నేతకు జరిగిన అన్యాయాన్ని.. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన నేతపై భద్రత కల్పించలేకపోయారని ఓటర్లు ఆందోళనకు దిగారు. తెదేపా కార్యకర్తలు సృష్టించిన అల్లర్లలో మహిళలకు గాయాలైయ్యాయి.