ఆంధ్రప్రదేశ్ సచివాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు కేబినెట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు కేబినెట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బలగాలను మోహరించారు. రైతులు సచివాలయం వైపు దూసుకొచ్చే అవకాశం ముండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం మార్గంలో టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ వాహనాలతోపాటు అగ్నిమాపక దళాలు మోహరించాయి. రాజధాని ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోంది.
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా రాజధాని ప్రాంతం మొత్తం రైతులు ఆందోళన తీవ్రతరం చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ నివాసానికి కొంతమంది రైతులు వెళ్తే పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. సచివాలయంలో రేపు జరుగున్న కేబినెట్ సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ శతృదుర్బేద్యంగా ఉందని చెప్పవచ్చు. అన్ని రకాల పోలీసు బలగాలను రెడీ చేశారు. పోలీసులంతా సర్వ సన్నధంగా ఉన్నారు.
తుళ్లూరు రైతుల ర్యాలీ కూడా ఇటువైపుగా వెళ్లింది. సచివాలయం వైపు వస్తారని ముందస్తు చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరినీ కూడా లోనికి సచివాలయంలోకి వెళ్లనివ్వడం లేదు. గుర్తింపు కార్డులు ఉంటేనే అందరినీ లోనికి పంపిస్తున్నారు. సీఎం జగన్ ను ఆటకం పరుస్తారనే అనుమానంతో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
సచివాలయం లోపలి నుంచి ఉద్యోగులను బయటికి వదిలారు. స్థానికులు కూడా గుర్తింపు కార్డులు చూపించి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సచివాలయానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీఐపీ, అధికారులు, అత్యవసర సేవలకు అనుమతిస్తామని చెప్పారు.
ఆందోళనకారులను గుర్తించి వారిని వెనక్కి పంపిస్తామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 104 సెక్షన్ అమలులో ఉంది. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దని గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారుల భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.