ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పను చెల్లెమ్మలూ

  • Publish Date - March 29, 2019 / 11:03 AM IST

కొవ్వూరు : ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పే వ్యక్తిని నేను కాదనీ..పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇచ్చిన కోటిమంది అక్కచెల్లెళ్లకు నేను అన్నననీ..వారు సంతోషంగా ఉండే బాధ్యతను తాను మరచిపోనని అలా జరగాలంటే మరోసారి టీడీపీ ఓటు వేయాలని చంద్రబాబు కోరారు. ఎక్కడ పేదరికముంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. 
 

మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజనీ..37 ఏళ్లు పూర్తి చేసుకుని 38వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన రోజునీ ఈ  సందర్భంగా ఆడబిడ్డలకందరికీ ప్రతీ శుభకార్యానికి పసుపు-కుంకుమలిస్తామని కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీని మరోసారి గెలిపిస్తే రాబోయే రోజుల్లో మూడు సార్లు పసుపు-కుంకుమలు మా ఆడబిడ్డలకు ఇస్తామని తెలిపారు.   పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఒక వ్యక్తికాదు ఒక వ్యవస్థ అని తెలిపారు. ఏపీలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ ఐదేళ్లలో చేసిన చూపించామన్నారు.

కోటిమంది ఆడబిడ్డలనున్న ఏకైక అన్నను తానేనని మీ కోసం మీ అన్న అండగా ఉండడనీ..అలా ఉండాలంటే ఎన్నికల్లో ఆడబిడ్డలంతా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కోటిమంది అన్నచెల్లెళ్లు తలచుకుంటే టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. ఇది పార్టీ ఎన్నికకాదనీ..భవిష్యత్తులో ఆడబిడ్డలంతా సంతోషంగా ఉండాలంటే టీడీపీకే ఓటు వేయాల్సిన అవసరముందన్నారు. 2014లో రైతు రుణమాఫీలు,పెన్షన్లు వీలుకాదని జగన్ అన్నాడనీ..ఇప్పుడు అదే జగన్ అవన్నీ ఇస్తానంటున్నాడని గుర్తు చేశారు. కానీ కష్టాల్లో ఉన్న రోజుల్లో కూడా తాను ఆడబిడ్డలకు పలువిధాలుగా ఆర్థికంగా చేయూతనిచ్చే కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు.   సామాజిక బాధ్యత అనీ.. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసే బాధ్యతగా ఆర్థిక సాయంగా  ఆడబిడ్డలకు రూ.1 లక్ష రూపాయలిస్తానని హామీ ఇచ్చారు.