ఉల్లి కోసం తిప్పలు : సబ్సిడీ కేంద్రం దగ్గర తొక్కిసలాట మహిళ తలకు గాయాలు

  • Publish Date - December 20, 2019 / 05:30 AM IST

ఉల్లి రేట్లు పెరగటం ఏమోగానీ ప్రజల ప్రాణాలమీదకొస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సబ్సిటీ ఉల్లిపాయలు ఇచ్చే కేంద్రం దగ్గర లైన్లలో తొక్కిసలాట జరిగింది. సబ్సిడీ ఉల్లి కేంద్రం దగ్గర మహిళలు లైన్లలో నిలబడ్డారు. ఈ క్రమంలో ఉల్లి కేంద్రం గేట్లు తెరవటంతో సబ్సిడీ ఉల్లిపాయల్ని దక్కించుకోవటానికి అందరూ ఒక్కసారిగా కదిలారు. దీంతో పలువురు మహిళలు  కిందపడిపోగా..ఓ కమలమ్మ అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

కాగా రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు సెంచరీని దాటేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే..రెండు సెంచరీలు దాటాయి. కిలో ఉల్లిపాయలు రూ.120 నుంచి 130 వరకూ అమ్ముతున్నారు. దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఉల్లిపాయల్ని తక్కువ ధరకు అందించేందుకు సబ్సిడీ కేంద్రాలను పెట్టింది.

ఈ కేంద్రాల వద్ద ప్రజలు తెల్లవారేసరికే లైన్లను నిలబడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గుడివాడలో రైతు బజార్ లో ఉల్లిపాయల కోసం భారీ క్యూలో నిలబడిన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. 

ట్రెండింగ్ వార్తలు