వినాయకుడు మైలపడతాడని అడ్డుకున్నారు : వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి అవమానం

గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసి దూషణకు దిగారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తుళ్లూరు మండలం

  • Publish Date - September 3, 2019 / 02:26 AM IST

గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసి దూషణకు దిగారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తుళ్లూరు మండలం

గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసి దూషణకు దిగారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తుళ్లూరు మండలం అనంతవరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కులం పేరుతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనను దూషించిన వారిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. 

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వినాయక చవితి ఉత్సవాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అనంతవరంలో దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరు చెప్పి అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే… వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపు చేయడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టీడీపీ నేతల ప్రవర్తనపై ఎమ్మెల్యే శ్రీదేవి మనస్తాపం చెందారు. మహిళ అని కూడా చూడకుండా… తనను కులం పేరుతో దూషించారని వాపోయారు. ఒక ఎమ్మెల్యేతోనే ఇలా ప్రవర్తిస్తే… సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై న్యాయ పోరాటం చేస్తానని శ్రీదేవి స్పష్టం చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వారిపై తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వీరంగంతో అనంతవరంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ నేతల్ని అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.