ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభానికి ముందే లీగ్ కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడి సూపర్ కింగ్స్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా మరో ప్లేయర్ ను ఎంచుకుంటున్నట్లు చెన్నై వెల్లడించింది. గతేడాది టైటిల్ ఎంచుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎంగిడి స్థానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ స్కాట్ కుగ్లీజెన్ తీసుకుంటున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది.
భుజానికి గాయం కారణంగా ఎంగిడి లీగ్‌కు రాలేకపోతున్నట్లు ప్రకటించేశాడు. అయితే ఆ స్థానంలో జట్టులోకి వచ్చే ప్లేయర్ లీగ్ మొత్తానికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది సీఎస్కే. స్కాట్ కుగ్లీజెన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా వేయగలడంతో జట్టుకు మరింత బలం చేకూర్చింది.
గతేడాది టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లోనూ పరాజయం లేకుండా దూసుకెళ్తోంది. తర్వాతి మ్యాచ్ ను మార్చి 31 ఆదివారం రాయల్స్ తో సొంతగడ్డపై తలపడేందుకు సిద్ధమవుతోంది.