చంద్రగిరిలో చంద్రబాబు : జగన్ మోటా రౌడీ చెవిరెడ్డి చోటా రౌడీ 

చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్...చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు.

  • Publish Date - April 2, 2019 / 10:32 AM IST

చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్…చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు.

చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్…చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు. చెవిరెడ్డి ఓ రౌడీ అనీ.. వారి నాయకుడు జగన్ రాష్ట్రానికి మోటా రౌడీ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చోటా రౌడీగా జులుం సాగిస్తుంటాడని ఎద్దేవా చేశారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశారనీ..ఇటువంటి వందమంది రౌడీలొచ్చిన భయపడేది లేదనీ వారి గుండెల్లో నిద్రపోతానని ధీమా వ్యక్తం చేశారు.రౌడీ అనేవాడు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదన్నారు.
Read Also : పారిపోలేదు : నేను ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు క్లారిటీ

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.  చంద్రగిరి నియోజయవర్గం తన జన్మభూమి అని 1978లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారనీ..1983లో కూడా ఎన్నికల్లో కూడా పాల్గొన్నానన్నారు. తరువాత వెనుకబడ్డ నియోజకవర్గమైన కుప్పానికి వెళ్లానని తెలిపారు. ఎమ్మెల్యేగా తనను 6 సార్లు గెలిపించారనీ ఏడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని చంద్రగిరి ప్రజలను తాను ఎప్పటికీ మరచిపోలేనీ తనను మరోసారి తనను గెలిపించాలని  చంద్రబాబు కోరారు.

1989 నుంచి 2014 వరకూ అంటే 30 సంవత్సరాలు తనను గెలిపించారనీ మరోసారి గెలిపిస్తే..రాష్ట్ర అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కోటి మంది చెల్లెమ్మలున్న ఏకైక అన్నను నేనేనని చంద్రబాబు మహిళలకు భరోసానిచ్చారు. మా ఆడబిడ్డలకు కష్టమొస్తే ఆదుకునేందుకు  పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులు గ్యాస్ సిలిండర్లను పండుగల సమయంలో ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. 
Read Also : ఓటు కంటే టూరే : పోలింగ్ పై లాంగ్ వీకెండ్ ప్రభావం