పశ్చిమగోదావరి : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ సచివాలయాల్లో స్థానిక
పశ్చిమగోదావరి : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో స్థానిక సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ సచివాలయాల్లో స్థానిక యువకులు 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను సీఎం అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని, పాలనలో పారదర్శకత తీసుకొస్తానని, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు వెంటనే ఉపాధి కల్పిస్తానని జగన్ చెప్పారు.
ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను ఏర్పాటు చేసి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యతను ఆ వలంటీర్ కు అప్పగిస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే ఫ్లాట్ల రుణం మాఫీ చేస్తానన్నారు. జాబు రావాలంటే బాబు రావాలి అని చంద్రబాబు చెప్పారని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని జగన్ అన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలి అంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ కు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఎవరికి వచ్చాయని జగన్ ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వలప పోతున్నారని వాపోయారు. కొత్త ఉద్యోగాలు ఏమో కానీ.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని జగన్ అన్నారు.
భీమవరంలో కనీసం చెత్త డంపింగ్ యార్డు కూడా లేదని, అనేక గ్రామాలకు తాగునీరే లేదని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని వాపోయారు.
తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీతో కాలుష్యం బారిన పడుతున్నా, ప్రజల ఆందోళనలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని జగన్ విమర్శించారు.