ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారనీ..ప్రస్తుతం ఎమ్మెల్యేలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారనీ..మేము అధికారంలోకి వస్తే మా బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్ప వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన నోటికి పని కల్పించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మమ్మల్ని వేధించే పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
మమ్మల్ని వేధిస్తున్నారు. ఇప్పుడు మా కార్యకర్తల్ని వేధిస్తున్నారు..అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి సొంతం కాదనీ కాలం మారుతుందని.. వైసీపీకి అధికారం ఐదేళ్లు మాత్రమేననీ..మమ్మల్ని వేధిస్తున్న పోలీసులూ…మీరు ఎన్నేళ్లు ఉద్యోగంలో ఉంటారో ఆలోచించుకోండి..అది గుర్తుంచుకుని పోలీసులు ప్రవర్తిస్తే మంచిదనీ జేసీ సూచించారు.