దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయి : జూపూడి

దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు.

  • Publish Date - March 24, 2019 / 07:35 AM IST

దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు.

విజయవాడ : దొంగ వ్యాపారాల వల్లనే జగన్ ఆస్తులు పెరిగాయని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించారని విమర్శించారు. జగన్ కు సీఎం అవ్వాలనే ఆలోచన తప్ప మరే ఆలోచన లేదన్నారు. సొంత ప్రయోజాల కోసం మోడీ, కేసీఆర్ తో అంటకాగారని ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

2004లో వైఎస్ఆర్ రూ.84 లక్షలు ఎన్నికల అఫిడవిట్ లో చూపిస్తే, 2019లో జగన్ రూ.340 కోట్లు ఎన్నికల అఫిడవిట్ లో చూపారని తెలిపారు. అఫిడవిట్ ఇస్తే సరిపోదని వాటికి లెక్కలు చెప్పాలని తెలిపారు. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్ పై 18 కేసులు ఎందుకు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.