గుడిలో ముగ్గురు పూజారులు దారుణ హత్య..!!
- nagamani
- Published On : September 11, 2020 / 04:34 PM IST
Karnataka: Arkeshwara temple 3 priests murdered : కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్యా జిల్లాలోని అర్కేశ్వర ఆలయంలో ముగ్గురు పూజారులు గురువారం (సెప్టెంబర్ 10,2020) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఆలయంలో ముగ్గురు పూజారుల శవాలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతులను ప్రకాష్, గణేష్, ఆనంద్ లు గా గుర్తించారు.
https://10tv.in/elephant-at-warsaw-zoo-to-test-cannabis-extract-oil/
ఈ హత్యలపై కర్ణాటక సీఎం యడ్యూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోరానికి కారణమైనవారిని అతి త్వరగా పట్టుకోవాలని పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఆదేశించారు. దేవుడికి సేవ చేసే పూజారులను హత్య చేయటం చాలా దారుణమని..ఈ ఘటన తనకు బాధకలిగించిందనీ ఆవేదన వ్యక్తంచేశారు. హత్యకు గురైన పూజారుల కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
దుండగులు దొంగతనం కోసమే వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన పూజారుల పక్కనే పెద్ద పెద్ద బండరాళ్లు పడి ఉండటంతో ..హుండీలో నుండి డబ్బులు తీసుకుంటుంటే అడ్డుపడిన పూజారులని బండరాళ్లతో తలమీద కొట్టి చంపారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నేరస్థుల కోసం ఆధారాలు సేకరిస్తున్నారు.
