కేసీఆర్ సర్వే : బీజేపీకి వచ్చేది 150 సీట్లే

  • Publish Date - March 29, 2019 / 01:06 PM IST

నల్గొండ : దేశంలో బీజేపీకి 150, కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా దాటవని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 సీట్లలో పోటీ చేస్తే ఒకటే సీటు గెల్చిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు అడ్రస్ ఉందా అని ఎద్దేవా చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. మోడీ ఐదేళ్ల పాలనలో దేశానికి ఏం ఒరిగిందని విమర్శించారు. చౌకీదార్ పాలనలో ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారో చెప్పాలన్నారు. 
Read Also : కాంగ్రెస్ పార్టీ కి మరో ఝలక్ : కారెక్కిన అరికెల నర్సారెడ్డి

మోడీ పాలనలో అంతా గోల్ మాల్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ కన్నా తెలంగాణ ఆరోగ్య శ్రీ గొప్పదన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతులకు బీజేపీ ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గాంధీలంతా ఒక దిక్కు.. చౌకీదార్ లంతా మరో దిక్కు ఉన్నారని తెలిపారు. దేశంలోని బీసీ ప్రజలు కనిపించడం లేదా అని నిలదీశారు. దేశంలో 50 శాతం ఉండే బీసీల కోసం ఒక మంత్రిత్వశాఖ పెట్టలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు బీసీలు చులకనైపోయారని తెలిపారు. 
Read Also : మెట్రో ప్రయాణికులకు ఐపీఎల్ ఆఫర్

సర్జికల్ దాడులను బయటికి చెప్పరని..కానీ వాటిని కూడా బీజేపీ ప్రభుత్వం చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు సూడో హిందువులు..మేము అసలైన హిందువులం..అని అన్నారు. ఓట్ల కోసం ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వరు..ఉన్న వాటిని లాక్కున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఉండి పెత్తనం చెలాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్