రాజధాని ఎక్కడికి పోదూ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. ఆదివారం తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వారిని కలిసి వినతిపత్రాన్ని తీసుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి కదలదని స్పష్టం చేశారు.
రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే హక్కు ఏపీ సీఎం జగన్ కు లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నాడు. అన్నీ పార్టీల మద్ధతుతోనే అమరావతి రాజధానిగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసేపిచ్చి పనులకు కేంద్రం జోక్యం చేసుకోదని అన్నారు.
ధర్నాకు దిగిన మహిళలపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు. ఇది రాజధాని రైతుల సమస్య కాదు.. రాజధాని సమస్య. మహిళలు శాంతియుతంగా పోరాడాలి. వారిపై పోలీసులు దాడికి దిగడం హేయమైన చర్య’ అని వెల్లడించారు.