KKRvsDC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. గతంలో కేకేఆర్‌ ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఢిల్లీ మాత్రం రెండింటిలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలుపొందింది. 

కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయం కోసం ఆరాటపడుతుండగా, ఢిల్లీ రెండో విజయాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌ విజయంపై ఢిల్లీ ధీమాగా ఉంది.