కొమురవెల్లి మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్ రావు

  • Publish Date - December 22, 2019 / 10:12 AM IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్లన్న కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్‌రావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. 

ఈ శుభ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీఛైర్‌పర్సన్‌ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. మల్లన్న కళ్యాణాన్ని వీక్షించటానికి వచ్చిన భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.