తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు : కేటీఆర్

ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

  • Publish Date - April 9, 2019 / 10:19 AM IST

ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ…కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. నల్లగొండలో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రసంగించారు. 

కాంగ్రెస్ అభ్యర్థులు ఏంపీలుగా గెలిస్తే రాహుల్ కు లాభం, బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తే మోడీకి మాత్రమే లాభమని..కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తే తెలంగాణకు లాభమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం