టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నపంజాబ్ కోల్‌కతాను కట్టడి చేయలేకపోయింది. సొంతగడ్డపై దినేశ్ కార్తీక్ జట్టు రెచ్చిపోయింది. ఈ క్రమంలో కోల్‌కతా … పరుగుల టార్గెట్ ను పంజాబ్ ముందుంచింది. ఆరంభంలో ఓపెనర్లు క్రిస్ లిన్(10), సునీల్ నరైన్(24)లు కాస్త తడబడినా రాబిన్ ఊతప్ప(65), నితీశ్ రానా(63) స్కోరును ముందుకు నడిపారు.
ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రస్సెల్ (48; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఇన్నింగ్స్ చివర్లో మయాంక్ క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దినేశ్ కార్తీక్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.
పంజాబ్ జట్టులో మొహమ్మద్ షమీ(1), వరుణ్ చక్రవర్తి(1), హర్దస్ విల్జియోన్(1), ఆండ్రూ టై(1) లు తీయగలిగారు.