అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో చిక్కిన చిరుత పులి

నల్లగొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఉచ్చుకు చిరుత చిక్కింది.

  • Publish Date - January 14, 2020 / 06:24 AM IST

నల్లగొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఉచ్చుకు చిరుత చిక్కింది.

నల్లగొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఉచ్చుకు చిరుత చిక్కింది. అటవీ పందుల కోసం అమర్చిన ఉచ్చులో చిరుత పులి చిక్కింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. మిరప రైతు పంటను అడవి పందులు నాశనం చేస్తుండటంతో నిన్న ఉచ్చు బిగించాడు.

అయితే తెల్లవారు జామున పొలం దగ్గరకు వెళ్లి చూడగా ఉచ్చులో చిరుత చిక్కుకుని ఉంది. దీంతో రైతు స్థానికులు, పోలీసులకు సమచారం ఇచ్చాడు. దీంతో స్థానికులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఉచ్చులో చిక్కుకున్నది చిరుత పులిగా అధికారులు నిర్ధారించారు. చిరుతపులి మూడేళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. 

అయితే మత్తు ఇంక్షన్ షూట్ చేసే గన్ అధికారుల దగ్గర లేనట్లు తెలుస్తోంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వరకు ఎవరూ దగ్గరకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతే చిరుత దగ్గరికి వెళ్లాలని అధికారులు చెప్పారు. చిరుతను జూపార్కుకు తరలించే అవకాశం కనిపిస్తోంది.