ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు. శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు సీఎం జగన్ ఆదేశాలతో రమణ దీక్షితులకు ఆలయం ప్రవేశం కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఆయనను ఆగమ సలహాదారుడిగా టీటీడీ నియమించనుంది. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణ దీక్షితులు సేవలను వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది.
కోర్టు కేసుల పరిష్కారం తర్వాత రమణ దీక్షితులకు అర్చకత్వ బాధ్యతలు అప్పగించాలని టీటీడీ నిర్ణయించినట్టు సమాచారం. అప్పట్లో టీటీడీపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో…రమణ దీక్షితులుని పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
మరోవైపు రమణ దీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజు ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. రమణ దీక్షితులు కుమారులు వెంకటకుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులు రెండేళ్లుగా విధులకు హాజరుకాలేదు. గతంలో గోవిందరాజులస్వామి గుడికి బదిలీ చేశారు. అక్కడా విధులకు హాజరుకాకపోవడంతో వీరిద్దరిని మళ్లీ బదిలీ చేశారు.