విజయవాడలో ముసుగు దొంగల హల్ చల్

  • Publish Date - November 21, 2019 / 06:17 AM IST

విజయవాడలో ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి షాపుల్లో చోరీలకు యత్నించారు. కంకిపాడు, ఈడ్పుగల్లుల్లోని మూడు షాపుల్లో చోరీకి యత్నించారు. కంకిపాడు మెయిన్ రోడ్ లోని  ఉదయలక్ష్మీ ఎరువుల షాపు..తాని పక్కనే ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ. ఈడ్పు గల్లులోని బేకరీ షట్టర్స్ ను పగులగొట్టారు.

అర్థ రాత్రి సమయంలో కారు వేసుకుని ముసుగులు వేసుకుని చోరీలకు శతవిధాలా యత్నించిన నలుగురు దొంగలకు దోచుకోవటానికి ఏమీ దొరకలేదు. కారులో వచ్చిన ముసుగు దొంగల దృశ్యాల్నీ అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ క్రమంలో సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ముసుగు దొంగల కోసం గాలిస్తున్నారు. పాపం ఏదో దోచుకుందామని గంపెడు ఆశతో వచ్చారు. కానీ ఏమీ చిక్కలేదు. దీంతో దొంగలు వెర్రి మొహాలు వేసుకోవాల్సి వచ్చింది.