ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు.

  • Publish Date - October 23, 2019 / 12:11 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు. రాజధానిలో శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని అడిగారు. తాత్కాలిక నిర్మాణాల్లో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకంగా మాట్లాడటం లేదన్నారు.

టీడీపీ పాలనలో రూ.2లక్షల కోట్ల ఆదాయం సృష్టించానని చంద్రబాబు పదే పదే చెబుతారు.. మరి ఆ ఆదాయం ఎక్కడికి పోయింది అని బొత్స అడిగారు. ఏపీ రాజధానిపై పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై బొత్స మాట్లాడారు. రాజధానిలోని ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణాలను సమీక్షించాలని పీటర్ కమిటీ నివేదించిందని బొత్స వెల్లడించారు.

ఏపీ రాజధాని అమరావతిలోని ప్రాజెక్టులు, నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం పీటర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అవకతవకల ఆరోపణలపై కమిటీ అధ్యయనం చేసింది. నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ కమిటీలో పీటర్, పొన్నాడ సూర్యప్రకాశ్, అబ్దుల్ బషీర్, నారాయణరెడ్డి, ఇయాన్ రాజు, ఆదివేషు సభ్యులుగా ఉన్నారు.