పగిలిన భగీరథ పైపు లైన్  : వృధాగా పోతున్న మంచి నీరు

  • Publish Date - May 11, 2019 / 09:32 AM IST

నిర్వాహకలోపంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ శివారులో భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుతోంది. 

ఆర్గుల్ నుంచి నిజామాబాద్ వెళ్లే పైపు లైన్ శనివారం మద్యాహ్న సమయంలో లీక్ అయింది.  నీరు ఒక్కసారిగా బయటికి రావడంతో అదుపుచేయలేకపోయారు. గంటసేపటికి పైగా నీరు  వృథాగా పోతూనే ఉంది. నీరంతా పంటపొలాల్లోకి వెళ్లడంతో చేతికి అందివచ్చిన పంట నాశనమవుతుందని రైతులు వాపోతున్నారు. 

ఇప్పటికే దగ్గర్లో ఉన్న ఉల్లిపంట భారీగా నీరు రావడంతో మునిగిపోయింది. అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంతో చర్యలు చేపట్టలేదు. జిల్లాలో గతంలో కూడా పలుమార్లు పలు చోట్ల పైపు లైన్ లీకేజీ అయినా అధికారులు పట్టించకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.