ఆ మానవ మృగాలను శిక్షించాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్

హైదరాబాద్‌ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై

  • Publish Date - November 30, 2019 / 05:13 AM IST

హైదరాబాద్‌ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై

హైదరాబాద్‌ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బయటికి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తుందో రాదో అనే అనుమానం భయపెడుతోంది. కాగా ప్రియాంక హత్య ఘటనపై రాజకీయ నేతల నుంచి సినీ ప్రముఖులు వరకు అంతా తీవ్రంగా స్పందించారు. ప్రియాంక కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ నలుగురిని బహిరంగంగా ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సైతం ప్రియాంక మర్డర్ కేసుపై స్పందించిన సంగతి తెలిసిందే. నిందితుల్ని కఠినంగా శిక్షాంచాలని రాహుల్ డిమాండ్ చేశారు.

తాజాగా వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రియాంక హత్య కేసుపై తన స్పందన తెలిపారు. ప్రియాంక హత్య తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు రోజా.

ప్రియాంక హత్య కేసు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులపై చార్జిషీట్ దాఖలు చేశామని సైబారాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీరంతా నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన వారని చెప్పారు. లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియాంక రెడ్డిని ట్రాప్ చేసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.