వచ్చాడయ్యో సామి : స్టెప్పులేసి ఇరగదీసిన ఎంపీ మాగుంట 

  • Publish Date - January 2, 2020 / 07:38 AM IST

న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు వేశారు.డ్యాన్సులేశారు. వైట్ అండ్ వైట్ లో వచ్చిన మాగుంట  తలకు తలపాగా కట్టుకుని డ్యాన్స్ చేశారు. తరువాత తలపాగా తీసి గాల్లో తిప్పుతూ స్టెప్పులేశారు. దీంతో కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు.

ఆయనతో పాటు వారు కూడా డ్యాన్సులేశారు. భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో సామి అనే పాటకు డ్యాన్స్ లతో ఇరదీశారు. ఫుల్ జోష్ గా ఆడిపాడారు. చక్కగా స్టెప్పులేశారు.  డాన్స్ లతో జోష్ గా ఉన్న ఎంపీ మెడలో ఓ పోలీసు దండ వేశారు. శాలువా కప్పి సన్మానించారు.