చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. ప్రాంతీయ వాదానికి కాలం చెల్లిందన్నారు. ఏపీలో బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈమేరకు నిర్వహించిన పాదయాత్రలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ దేశ ప్రగతిని ప్రపంచానికి చాటారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే నినాదంతోనే ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సపోర్టు చేసిందన్నారు.
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేయడంలో విఫలం చెందారని చెప్పారు. ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని..జలశక్తి మంత్రి వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. నివేదిక సమర్పించిన తర్వాతే యాక్షన్ తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు.
ప్రతిపాదనలు పెట్టలేదని.. ప్రాజెక్టు త్వరిగతిన పూర్తి కావడానికి ఏమైనా సహాయం కావాలా అని నివేదిక అడిగామన్నారు. పోలవరం ప్రాజెక్టును వద్దని ఎవరూ అనడం లేదన్నారు. ఎప్పుడో పూర్తిచేయాల్సింది ఇంకా పూర్తి చేయలేదని బాధ కల్గుతుందన్నారు. బీజేపీతో టీడీపీ స్నేహ హస్తంపై ఏదైనా లెటర్ తీసుకొస్తే తాను తమ అధిష్టానంతో మాట్లాడుతానని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.