ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగుమ్మ అనేవారు.ఇప్పుడు ఎంత పీలగా ఉంటనే అంత ఫేమస్ అన్నమాట. అంటే జీరో సైజే ఇప్పటి ట్రెండ్.
కానీ మనిషి ఎంత లావున్నా నడుము మాత్రం నాజూగ్గా ఉంటే ఆ అందమే వేరుగా..నాగుపాములాంటి నాజూకు నడుము గల సుందరి అంటూ ఎంతోమంది భావకవులు కవితలతో ఆడవాళ్ల నడుముల గురించి పాటలు కూడా రాసి పడేశారు. నడుము సన్నగా ఉంటే ఆ అమ్మాయి అందమే రెట్టింపు అవుతుంది. అటువంటిదే కుర్రకారు గుండెల్ని తన నడుము అందాలతో ఉర్రూతలూగించింది గోవా భామ ఇలియానా. ఆమెకున్న నడుము మరె నటికీ లేదంటే అతిశయోక్తి కాదు.
కానీ ఈ మయన్మార్ సుందరి నడుము అందంలో ఇలియానాను మించిపోయింది. అసలు నడుం ఉందా లేదా అనే డౌట్ వస్తుంది అమ్మాయిను చూస్తే. అసలు బ్రహ్మదేవుడు ఈ సుందరకి నడుము పెట్టడం మర్చిపోయినట్టున్నాడని కూడా అనిపిస్తోంది. ఈ నాగుపాములాంటి నాజూకు నముడు అందాల అమ్మడి నడుము సైజు 13.7 ఇంచులే. ఆమె పేరు సుమొహ్ నాయింగ్.
23 ఏండ్ల ఈ మయన్నమార్ సుందరి సుమొహ్ నాయింగ్ నడుముతో ఫేమస్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత చిన్న నడుముగా గుర్తింపుపొందింది. నాయింగ్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన కొందరు ఈ ఫోటోలు ఫేక్ అని, మరికొందరు ఫోటోషాప్ చేపించారని కామెంట్లు వస్తున్నాయి. వాటిపై నాయింగ్ మాట్లాడుతూ ‘నా నడుము సహజమైనది. దీనికోసం ఎలాంటి ఆపరేషన్లు చేయించలేదు..నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. నడుమును ఇలానే మెయింటైన్ చేయడానికి హెల్దీ డైట్ చేస్తుంటాను. నా ఫోటోలు చూసి ఆశ్చర్యపోయే వారిని చూసి ఆనందపడుతుంటానని’ చెప్పుకొచ్చింది ఈ నడుము అందాల సుందరి.