నాతో పెట్టుకోవ‌ద్దూ : నీ అడ్ర‌స్ ఎక్క‌డ‌రా.. పీక‌కోస్తా.. నీ సంగ‌తి తేలుస్తా..

అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు వివాదానికి దారితీసింది.

  • Publish Date - April 4, 2019 / 10:53 AM IST

అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు వివాదానికి దారితీసింది.

అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు విమర్శలకు దారితీసింది. బాలయ్య మాటలకు, చేష్టలకు అంతా  షాక్ అవుతున్నారు. హిందూపుంలో మొన్న వీడియో జర్నలిస్టుకి వార్నింగ్ ఇచ్చి విమర్శలపాలైన బాలయ్య.. ఈసారి సొంత పార్టీ కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు. పీక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వివాదానికి  కారణమయ్యారు.

నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. అంటూ బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కార్యకర్తలనే బూతులు తిట్టారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. సొంత కార్యకర్తలపైనే బాలయ్య  రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త.. ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుంది అంటూ అరిచాడు. మరో కార్యకర్త ఈసారి 60వేల మెజారిటీ అంటూ కేకలు వేశాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది.

హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలని (సైగ చేస్తూ) పక్కనే ఉన్న భార్య వసుంధరతో బాలయ్య అన్నారు. బాలకృష్ణ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తుండగా వసుంధర నవ్వుతూ కనిపించారు. మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్‌ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు, అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా(సైగ చేసి మరీ).. అంటూ బాలయ్య రెచ్చిపోయారు. దీనికి సంబంధించి వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. బాలకృష్ణ చేష్టల పట్ల స్థానికులే కాదు టీడీపీ కార్యకర్తలూ విస్మయం చెందుతున్నారు. బాలకృష్ణ షార్ట్ టెంపర్, నోటికొచినట్టుల తిట్టేస్తారు, ఆ తర్వాత విమర్శలు పాలవుతారు.. ఆపై సారీ చెబుతారు.. బాలయ్యకు ఇవన్నీ కామన్ అని నెటిజన్లు అంటున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి హుందాగా వ్యవహరించాలని.. ఇలా దిగజారి పోకూడదని, రౌడీలా బిహేవ్ చెయ్యకూడదని కొందరు నెటిజన్లు హితవు పలికారు.