చినబాబు చిరుతిండి రూ.25 లక్షలు కథనంపై లోకేష్ సీరియస్

ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్‌ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా

  • Publish Date - October 29, 2019 / 04:15 AM IST

ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్‌ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా

ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్‌ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా వేయనున్నారు. ఈ నెల 25న ఓ దినపత్రిక.. చినబాబు చిరుతిండి 25 లక్షలు అంటూ ప్రచురించింది. ఈ కథనంపై నారా లోకేష్‌ న్యాయపోరాటానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఆ పత్రిక యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపారు. లీగల్ నోటీసులకు యాజమాన్యం స్పందించిన తర్వాత  పరువు నష్టం దావా వేయనున్నారు.

అధికారంలో ఉండగా విశాఖ ఎయిర్ పోర్టులో చిరుతిళ్ల కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టానని వచ్చిన కథనం అవాస్తవం అని లోకేష్ చెప్పారు. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నానని తెలిపారు. 

లోకేష్ స్నాక్స్ ఖర్చుని.. వైసీపీ ఎంపీ అధికారికంగా ట్వీట్ చేయడం మరింత కలకలం రేపింది. ‘విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు గారి పుత్రరత్నం లోకేష్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట. నిజంగా నారా లోకేష్ తిండే ఆ స్థాయిలో ఉంటుందా? ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా? వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం రూ.25 లక్షల భత్యంతో నెల రోజులు గడుపుతుంది.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

లోకేష్ .. స్నాక్స్ కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని గురించి పెద్ద రచ్చ జరిగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో లోకేష్ ఈ కథనాన్ని సీరియస్ గా తీసుకున్నారు. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.