ఇవాళ(26 డిసెంబర్ 2019) ఉదయం పది గంటలకు రాజధాని గ్రామాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజధాని అమరవతిలోనే కొనసాగించాలి అంటూ ఉద్యమం చేస్తున్న రైతులకు, రైతు కూలీలకు సంఘీభావంగా లోకేష్ ప్రతి గ్రామంలో తిరగనున్నారు.
ఉదయం 10 గంటలకు ఎర్రబాలెం. 11 గంటలకు మందడం. 12 గంటలకు వెలగపూడి గ్రామాల్లో లోకేష్ పర్యటించనున్నారు.
బడేటి బుజ్జికి సంతాపం:
అలాగే ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(కోట రామారావు) మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి బుజ్జి అని గుర్తు చేసుకున్నారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించారని కొనియాడారు. ప్రజల మనిషి బడేటి బుజ్జి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బుజ్జి మృతి పార్టీకి తీరని లోటు అంటూ లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.