నోరు కట్టేసుకోండి : రాత్రి 9 దాటితే మందు దొరకదు

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం

  • Publish Date - September 28, 2019 / 10:00 AM IST

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత సేల్స్ ఉండవు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో 3వేల 500 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.

మద్యపానం వల్ల అనేక కుటుంబాలు చితికిపోతున్నాయని మంత్రి వాపోయారు. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రస్తుతం 450 షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. అవినీతికి తావు లేకుండా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తారని మంత్రి చెప్పారు. 676 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపామన్నారు. మద్యం నిషేధానికి ప్రతిపక్షం, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతికి తావు లేకుండా మద్యం షాపుల నిర్వహణ ఉంటుందన్నారు.

దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ షాపులను రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సీఎం జగన్ ఎన్నికల హామీకి అనుగుణంగా పాలసీకి రూపకల్పన చేసిన అధికారులు.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా విధివిధానాలు రూపొందించారు. దశలవారీగా మద్య నిషేధం అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3వేల 500 దుకాణాలు మాత్రమే నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఎక్కడెక్కడ షాపులను పెట్టాలనేదానిపై బేవరేజెస్ కార్పొరేషనే నిర్ణయం తీసుకుంది. ప్రతి షాపులో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. ఇక లీజు అద్దెలు నిర్ణయించడం, షాపుల ఎంపిక బాధ్యతను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ చూసుకోనుంది. మద్యం షాపుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవలే సిబ్బందిని రిక్రూట్ మెంట్ చేసింది. సూపర్ వైజర్లు, సేల్స్ మెన్ పోస్టులు భర్తీ చేసింది.