ఆ కార్డు ఉంటేనే మద్యం : ప్రభుత్వం కొత్త రూల్

సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి

  • Publish Date - December 5, 2019 / 03:47 PM IST

సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి

సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. కొత్తగా క్యాష్ లెస్ మద్యం అమ్మకాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మద్యం కొనుగోళ్ల కోసం మద్యం కార్డులు తీసుకురానుంది. ఇక నుండి ఎవరైనా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే లిక్కర్‌ పర్చేజ్ కార్డు కొనాల్సిందే. ఆ కార్డును పొందాలంటే రూ.5 వేలు చెల్లించాలి. 

మొబైల్‌ ఫోన్ కి రీచార్జ్‌ చేసినట్లు ఈ కార్డుని రీచార్జ్‌ చేయాలి. లిక్కర్ కార్డులోని అమౌంట్ అయిపోయాక మళ్లీ రూ.5వేలు చెల్లించి కార్డు రెన్యూవల్ చేసుకోవాలి. అంతేకాదు, 25 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ కార్డును పొందటానికి అర్హులు. 25 ఏళ్లు నిండినట్టుగా మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలా సర్టిఫికెట్ ఉన్న వాళ్లకే ఈ కార్డులు ఇస్తారు. గుర్తింపు పొందిన ఆసుపత్రి డాక్టర్‌ నుండి ఏ జబ్బు లేదని మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాల్సి ఉంటుంది. లిక్కర్ పర్చేజ్ కార్డు విధానం ద్వారా ముందుగా నిధులు సేకరించడంతో పాటు, అమ్మకాలను కూడా నియంత్రించినట్టుగా ఉంటుందనేది ప్రభుత్వం ప్లాన్.
  
మద్యపానాన్ని పూర్తిగా నిషేధించే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మద్యంపై ఒక్కసారే నిషేధం విధిస్తే వ్యతిరేకత వస్తుందనే భావనతో.. దశలవారీగా నిషేధాన్ని విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అలానే మద్యం ధరలను భారీగా పెంచింది. పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇవ్వడం లేదు. అదే విధంగా రెస్టారెంట్ లలో కూడా మద్యం విక్రయాల సమయాన్ని తగ్గించారు. బార్ లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేశారు. ఇలా కొంతవరకు మద్యం అమ్మకాలను తగ్గించడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.