‘కియా’మోటార్ తరలింపు అవాస్తవం: రాయిటర్స్, లైవ్ మింట్ కథనాల్ని ఖండిస్తున్నాం: ఏపీ పెట్టుబడుల శాఖ సీఎస్ రజత్ భార్గవ్

  • Publish Date - February 6, 2020 / 07:28 AM IST

‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలపై ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. దీన్ని ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ తీవ్రంగా ఖండించారు. ఈ వార్తలు అవాస్తవమనీ..కియ ఏపీలోనే ఉంటుందని తమిళనాడుకు తరలిపోవటంలేదని స్పష్టం చేశారు.  

రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. 1.1బిలియన్ డాలర్లతో  ఏర్పాటైన కియ పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడుకు తరలింపుపై సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయని వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్.

గత ఏడాదిగా వచ్చిన మార్పులతో..ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలపై…పునరాలోచన చేసిన కియా తమిళనాడుకు తరలిపోతుందని..రాయిటర్స్, లైవ్ మింట్ కథనాల్లోని సారాంశం. కానీ ఈ కథనాలు పూర్తిగా అవాస్తవమనీ ఏపీ పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యం శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం కియ మోటార్ సంస్థ కలిసి పనిచేస్తుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. 
 

ట్రెండింగ్ వార్తలు