అక్కడ మాకు భూములున్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా 

  • Publish Date - January 3, 2020 / 05:36 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం జిల్లాలోని నీరుకొండలో నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి భూములు లేవనీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మాకు నీరుకొండలో భూములున్నాయనీ ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. నా భార్య పేరున ఐదు ఎకరాల భూమి ఉన్నందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..దీన్ని నిరూపిస్తే ఆ ఐదు ఎకరాల భూమిని వారిపేరున రిజిస్ట్రేషన్ చేస్తానని..తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. 

రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆర్కే ఆరోపించారు.  చంద్రబాబు రాజధానికి శాపంగా మారారని సీఎం జగన్ వరంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను పోరాడానని నాపై ఏడు కేసులు పెట్టారని ఆరోపించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు కొత్త బినామీగా పవన్ కళ్యాణ్ తయారయ్యారనీ వీరిద్దరూ కలిసి ప్యాకేజీలు తీసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు ఆర్కే. చంద్రబాబు చేసిన దోపిడీలను పవన్ సమర్థిస్తున్నారనీ..చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసారనీ  ఆర్కే ఆరోపించారు.