నిజామాబాద్‌లో ఏం జరుగుతోంది : స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకోని ఈవీఎంలు

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బోధన్ నుంచి ఇంకా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకోలేదు. బోధన్ నుంచి ఈవీఎంలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని

  • Publish Date - April 12, 2019 / 06:17 AM IST

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బోధన్ నుంచి ఇంకా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకోలేదు. బోధన్ నుంచి ఈవీఎంలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బోధన్ నుంచి ఇంకా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకోలేదు. బోధన్ నుంచి ఈవీఎంలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈవీఎంల తరలింపులో జరుగుతున్న జాప్యంపై రాజకీయ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నుంచి మాత్రమే ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి.

నిజామాబాద్ లోక్‌సభ నియోజకర్గంలో ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాలెట్ యూనిట్‌తో ఎన్నికలు నిర్వహించడేమ ఇందుకు కారణం. సీఎం కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు వాడారు. ఎంపీ సీటు కోసం 185మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒక్కో బూత్ లో 12 ఈవీఎంలు వాడారు. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 15 లక్షల 52 వేల 733 మంది ఓటర్లు ఉండగా 185 మంది అభ్యర్దులు పోటీపడ్డారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్దులు ఏడుగురు ఉండగా 178 మంది రైతు అభ్యర్దులున్నారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని.. ప్రపంచంలో ఇటుంటి ఎన్నిక తొలిసారి నిర్వహించినందున గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చేర్చాలని కోరుతూ గిన్నిస్ బుక్ నిర్వాహకులకు లెటర్ రాశామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. బరిలో ఉన్న 185 మంది అభ్యర్ధుల వివరాలను తెలియజేస్తూ ఒక్కో పోలింగ్ బూత్‌లో ఎం 3కి చెందిన 12 ఈవీఎంలను వినియోగించారు.